దృశ్యం నటి షార్ట్స్‌పై కామెంట్.. కౌంటర్‌తో షాక్ తిన్న నెటిజన్

by Jakkula Samataha |
దృశ్యం నటి షార్ట్స్‌పై కామెంట్.. కౌంటర్‌తో షాక్ తిన్న నెటిజన్
X

దిశ, సినిమా : మలయాళ బాల నటి ‘ఎస్తర్ అనిల్’ పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు కానీ, దృశ్యం మూవీలో వెంకటేష్, మీనాల చిన్న కుమార్తెగా చేసిన అమ్మాయి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. మలయాళ మాతృకతో పాటు తమిళ్‌లో కూడా ఆ పాత్రలో తనే నటించింది. అంతేకాదు తాజాగా మలయాళంలో విడుదలైన ‘దృశ్యం-2’లోనూ ఎస్తర్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇటీవలే బెంగళూరూలో జరిగిన ఓ పార్టీకి నేవీ-బ్లూ పార్టీ వేర్‌లో హాజరైన ఎస్తర్.. ఆ పార్టీ ఫొటోలను తన ఇన్‌స్టా అకౌంట్‌లో పంచుకుంది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఆ ఫొటోలు వైరల్ కాగా, ఓ నెటిజన్ తన బట్టలపై వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. అయితే అతనికి గట్టి కౌంటర్ ఇచ్చింది ఎస్తర్.

ఎస్తర్ ఫొటోలపై.. ‘ఇప్పుడు మీరు హిందీ సినిమాల్లో నటించడానికి అర్హత పొందారు. మీరు ఇంగ్లిష్ సినిమాల్లో నటించే నైపుణ్యాన్ని కూడా చూపించాలి’ అంటూ నెటిజన్ కామెంట్ చేయగా, దానికి ఎస్తర్ నవ్వుతున్న ఎమోటికాన్‌తో పాటు ‘సార్.. నా అర్హతలను నిర్ణయించడానికి మీరు ఎవరు?’ అని సమాధానం ఇచ్చింది. ఆమె కూల్ ఆన్సర్‌కు ఇతర సెలెబ్రిటీలు, నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించడంతో పాటు, మద్ధతుగా నిలిచారు. ఇటీవల కాలంలో సెలెబ్రిటీల దుస్తులపై ట్రోలింగ్ బాగా పెరిగింది. గతంలో మలయాళ నటి అనస్వర రాజన్‌ షార్ట్స్ ధరించడంతో నెటిజన్లు ఆమెపై చాలా నెగటివ్‌గా కామెంట్లు చేశారు. దాంతో ‘ఉమెన్ హ్యావ్ లెగ్స్’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ఆమెకు సపోర్ట్ లభించింది. నటి రజనీ చాంది విషయంలోనూ ఇలానే జరిగింది. బుల్లితెర యాంకర్, వెండితెర రంగమ్మత్త కూడా తరచూ ఇలాంటి ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. అయితే ఆ కామెంట్లకు అనసూయ కూడా గట్టిగానే సమాధానం ఇస్తుంది.

Advertisement

Next Story