12 లక్షల విలువైన డ్రగ్స్ తెప్పించిన భీమవరం యువకుడు

by srinivas |
12 లక్షల విలువైన డ్రగ్స్ తెప్పించిన భీమవరం యువకుడు
X

దిశ, ఏపీ బ్యూరో: నిన్న మొన్నటి వరకూ మద్యానికి బానిసలై యువకులు జీవితాలను చిన్నాభిన్నం చేసుకున్నారు. ఇప్పుడు డ్రగ్స్‌లో కిక్ ఉందంటూ జీవితాలను మరింత నాశనం చేసుకుంటున్నారు. భీమవరానికి చెందిన ఓ యువకుడు 12 లక్షల విలువైన డ్రగ్స్‌ను నెదర్లాండ్స్ నుంచి తెప్పించుకున్న ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కస్టమ్స్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం… నెదర్లాండ్స్ నుంచి ఒక పార్శిల్ చెన్నై విమానాశ్రయానికి వచ్చింది. పార్శిల్‌పై ఆటబొమ్మలు అని ఉంది. దీంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు పార్శిల్ ఓపెన్ చేసి చూడగా, అందులో ఆటబొమ్మలు, వాటిల్లో 400 మత్తు మాత్రలు లభించాయి. వాటి విలువ రూ.12 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. దీంతో దానిపై ఉన్న అడ్రస్ వెతుక్కుంటూ బయల్దేరగా తూర్పుగోదావరి జిల్లా భీమవరంలోని ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకుడు(27)ని పట్టించింది. దీంతో అతనిని అరెస్టు చేసి, చెన్నై కస్టమ్స్ కార్యాలయానికి సుకెళ్లారు. అనంతరం విచారించి, కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్ నిమిత్తం పుళల్ జైలుకు తరలించారు.

Advertisement

Next Story