ఇండియాకు నేపాల్ కొత్త మ్యాప్

న్యూఢిల్లీ: సవరించిన నేపాల్ మ్యాప్‌ను ఇండియా, ఇతర విదేశాలతోపాటు ఐక్యరాజ్య సమితికి పంపిస్తామని ఆ దేశం పేర్కొంది. ఈ నెల మధ్యలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. భారత భూభాగాలు కాలాపానీ, లిపూలేఖ్, లింపియదురా ఏరియాలను కలుపుకుని సవరించిన మ్యాప్‌కు ఆ దేశ చట్టసభలు ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాలాపానీ, లిపూలేఖ్, లింపియదురాలున్న సవరించిన కొత్త మ్యాప్‌ను భారత్, యూఎన్ ఏజెన్సీలు, అంతర్జాతీయవర్గాలకు పంపించనున్నట్టు ల్యాండ్ మేనేజ్‌మెంట్ మినిస్టర్ పద్మ అర్యల్ వెల్లడించారు.

అంతర్జాతీయ వర్గాలకు ఈ మ్యాప్‌ను అందించడానికి సుమారు నాలుగువేల కాపీలను ప్రింట్ చేయాలని ఈ మంత్రిత్వ శాఖ మెజర్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కనీసం 25వేల కాపీలు పంచిపెట్టారు. నేపాల్ జాతీయ ముద్రలో ఆ దేశ చిత్రపటముంటుంది. అన్నిఅధికారిక చిత్తరువులపై ఈ ముద్ర వేస్తుంటారు. నేపాల్‌లో అంతర్గవైరం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ప్రధాని ఓలీకి ప్రచండకు మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. భారత్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ఓలీ వ్యాఖ్యలు రాజకీయంగా, దౌత్యపరంగా ఏ మాత్రం ప్రయోజనకరం కాదని ప్రచండ మండిపడ్డారు.

Advertisement