పీఎం మోడీకి నేపాల్ ప్రధాని ఫొన్..

by Shamantha N |
పీఎం మోడీకి నేపాల్ ప్రధాని ఫొన్..
X

దిశ, వెబ్ డెస్క్: నేపాల్, భారత్ మధ్య ఇటీవల ఇబ్బందికర పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మనదేశంలోని కాలాపానీ, లిపులేఖ్, లింపియాధుర భూభాగాలను తమవిగా చెప్పుకుంటూ నేపాల్ ప్రభుత్వం కొత్తగా ఓ మ్యాప్‌ను ఆమోదించింది. ఈ విషయంలో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే, నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫొన్ చేశారు. ఇండియా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వీరిరువురూ ప్రపంచాన్ని పట్టి పీడీస్తున్న కరోనా పరిస్థితులపై చర్చించారు.

అంతకుముందు ఓలీ ట్విట్టర్ ద్వారా ‘ భారత్ 74వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా పీఎం మోదీ, ప్రభుత్వానికి, దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులు మరింత ప్రగతి, సౌభాగ్యం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ పోస్టు చేశారు.

Advertisement

Next Story

Most Viewed