రాముడు మా దేవుడే : నేపాల్ ప్రధాని

by Anukaran |   ( Updated:2020-07-13 10:51:32.0  )
రాముడు మా దేవుడే : నేపాల్ ప్రధాని
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ పై నేపాల్ ప్రధాని కేపీ ఓలి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చైనా అండ చూసుకోని కవ్వింపు చర్యలకు దిగడంతోపాటు దేశ సరిహద్దుపై తప్పుడు ప్రకటచలు చేశారు. ఏకంగా ఆ దేశ మ్యాప్ లో భారత భూభాగాన్ని తమదిగా చూపించారు. మూడు రోజుల క్రితం ఆ దేశ ఉప ప్రధాని పిలుపు మేరకు భారత్ కు చెందిన టీవీ ఛానళ్ల ప్రసారాలను కూడా నిలిపి వేశారు.

తాజాగా ప్రధాని కేపీ ఓలి భారత్ పై తన అక్కస్సును వెళ్లగక్కారు. ఆయన ఏమన్నారంటే.. ‘రాముని జన్మభూమి తనదని చెప్పుకుంటు భారత్ సంస్కృతి దోపిడీకీ పాల్పడుతుంది. భారత్ లో ఉన్నది అసలైన అయోధ్య కాదు. అసలైన అయోధ్య నేపాల్ లోని థోరి దగ్గర ఉన్నది. వాళ్లు నకిలీ అయోధ్యను సృష్టించారు.’ అని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed