పాపం ప్రధాని.. పార్టీ నుంచి బహిష్కరించారు

by Ramesh Goud |
పాపం ప్రధాని.. పార్టీ నుంచి బహిష్కరించారు
X

దిశ,వెబ్‌డెస్క్: నేపాల్‌లోఅధికార పార్టీ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్సీపీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని ఖడ్గప్రసాద్ శర్మ ఓలి (కేపీ శర్మ ఓలి)ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది డిసెంబర్ 20న ప్రధాని ఖడ్గప్రసాద్ పార్లమెంట్ రద్దు చేసి, 2021 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించేలా నిర్ణయించారు. ఆ నిర్ణయంపై నేపాల్ అధికార పార్టీలో సంక్షోభం తలెత్తింది అధికార పార్టీ ఎన్సీపీలో పుష్పకమల్ దహల్, ఓలి వర్గాలు ఉన్నాయి. ఓవర్గానికి చెందిన దహల్ వర్గం సమావేశమై ప్రధాని ఖడ్గప్రసాద్ ను పార్టీ నుంచి బహిష్కరించేలా చర్చలు జరిపాయి. అనంతరం ఓలిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఓలి ప్రత్యర్థి వర్గ నేత మాధవ్ కుమార్ నేపాల్ మాట్లాడుతూ.. అధికార ఎన్‌సీపీ చైర్మన్ పదవి నుంచి ఖడ్గప్రసాద్ ను తొలగించినట్టు చెప్పారు.

కాగా రెండుగా చీలిపోయిన అధికారపార్టీ సభ్యులు పార్టీపై తమదే పెత్తనమని, లేదంటే తమకే హక్కుందంటూ దెబ్బలాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలసంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

Advertisement

Next Story