నైబర్లీ షట్‌డౌన్… ఫేస్‌బుక్ ముందు ఓడిపోతున్న గూగుల్

by Harish |
నైబర్లీ షట్‌డౌన్… ఫేస్‌బుక్ ముందు ఓడిపోతున్న గూగుల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫేస్‌బుక్‌కి ఛాలెంజ్‌గా గూగుల్ తీసుకొస్తున్న యాప్‌లన్నీ ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఇప్పటి వరకు గూగుల్+, గూగుల్ బజ్, గూగుల్ వేవ్ యాప్‌లను ఫేస్‌బుక్‌కి చాలెంజ్ చేస్తూ గూగుల్ విడుదల చేస్తుంది. వీటి అవసరం వేరైనా దాదాపు ఫేస్‌బుక్ చేసే పనినే ఈ యాప్‌లు కూడా చేస్తాయి. అయితే వీటిలో గూగుల్+ మాత్రమే ఇప్పుడు నడుస్తోంది. అది కూడా చాలా తక్కువ.

ఇక ఇదే బాటలో నైబర్లీ పేరుతో 2018లో గూగుల్ తీసుకొచ్చిన లోకల్ సోషల్ యాప్ కనీసం బీటా దశ కూడా దాటకుండానే మూతపడిపోబోతోంది. భారతదేశం కేంద్రంగా స్థానిక విపత్తులు, అవసరాలు, షాపులు, పర్యాటక స్థలాల గురించి వేరే యూజర్లను ప్రశ్నలు అడగడం ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ పెంచుకోవచ్చు. అంతేకాకుండా స్థానిక సంస్కృతి, సదుపాయాల గురించి తెలుసుకోవచ్చు. మొదటగా ముంబైలో ప్రారంభించిన ఈ యాప్‌ను జనాలు పెద్దగా ఆదరించలేదు. దీంతో మే 12న ఈ యాప్‌ను షట్‌డౌన్ చేయబోతున్నట్లు గూగుల్ ప్రకటించింది. బ్యాకప్ కావాల్సిన వారి కోసం అక్టోబర్ 12, 2020 వరకు మాత్రం తాత్కాలికంగా అందుబాటులో ఉంచనున్నట్లు గూగుల్ తెలిపింది.

Tags: google, Neighbourly, Facebook, Google wave, google plus

Advertisement

Next Story

Most Viewed