గతనెలలో నీట్ రాయలేనివారికి 14న పరీక్ష

by Anukaran |   ( Updated:2020-10-12 05:48:32.0  )
గతనెలలో నీట్ రాయలేనివారికి 14న పరీక్ష
X

న్యూఢిల్లీ: కరోనా కారణంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు(నీట్)ను రాయలేని విద్యార్థులకు మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. కరోనా లేదా కంటైన్‌మెంట్ జోన్‌లో నివసించడం మూలంగా గతనెల 12న నిర్వహించిన నీట్‌కు కొందరు విద్యార్థులు హాజరుకాలేకపోయారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. వారి కోసం బుధవారం నీట్ పరీక్షను మరోసారి నిర్వహిస్తున్నట్టు వివరించారు. దీంతో సీజేఐ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్నా, జస్టిస్ వి రామసుబ్రమణియణ్‌ల ధర్మాసనం నీట్ పరీక్షను మరోసారి నిర్వహించాలన్న ఆదేశాలు జారీ చేసింది. సోమవారం విడుదలవుతాయని భావించిన నీట్ ఫలితాలు 16న విడుదల కానున్నాయి. రెండోసారి నిర్వహించిన నీట్ మూల్యాంకనం తర్వాత రెండు పరీక్షల ఫలితాలు ఒకేసారి శుక్రవారం విడుదల చేయనున్నారు. కరోనా కారణంగా నీట్ వాయిదా వేయాలని విద్యార్థులు, బీజేపీయేతర పార్టీలు అధికారంలోని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం నిరాకరించింది. విద్యా సంవత్సరాన్ని వృథా చేయవద్దని, నీట్ నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed