- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షెడ్యూల్ ప్రకారమే నీట్, జేఈఈ -కేంద్ర విద్యాశాఖ
దిశ, వెబ్ డెస్క్: నీట్, జేఈఈ 2020 పరీక్షలు మరోసారి వాయిదా పడబోవని, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖారే స్పందిస్తూ నీట్, జేఈఈ వాయిదా వేయబోరని, సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు. ఈ పరీక్షలు వాయిదా వేయమని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కార్యాలయమూ ధ్రువీకరించింది.
కరోనా మహమ్మారి కారణంగా నీట్, జేఈఈలను వాయిదా వేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్‌లను ఈ నెల 17న సుప్రీంకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థిస్తూ కొందరు విద్యార్థులు వేసిన పిటిషన్‌తో తాము సమ్మతించడం లేదని, కరోనా ఆపత్కాలం కొనసాగుతున్నప్పటికీ జీవితం మాత్రం సాగాల్సిందేనని తెలిపింది. అందుకే ఒక విద్యా సంవత్సరాన్ని పూర్తిగా వాయిదా వేసి విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టబోమని వివరించింది.
కరోనా మహమ్మారి వచ్చే ఏడాదీ సమసిపోకుంటే ఆ ఏడాది కూడా పరీక్షలను వాయిదా వేయమంటారా? అంటూ ప్రశ్నించింది. ఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే (సెప్టెంబర్‌లో) నిర్వహించాలని ఆదేశించింది. కాగా, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా నీట్, జేఈఈలను దీపావళి వరకు వాయిదా వేయాలని మోడీ ప్రభుత్వాన్ని కోరారు. అయినప్పటికీ, వీటిని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.