- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో విప్లవం' రావాల్సిన అవసరం ఉంది: ప్రధాని మోదీ!
దిశ, వెబ్‌డెస్క్: ప్రజలకు తక్కువ ధరలో, నమ్మకమైన చెల్లింపుల వ్యవస్థను అందించేందుకు ‘ఫిన్‌టెక్ విప్లవం’ రావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ(ఐఎఫ్ఎస్‌సీఏ) నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరమ్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని.. దేశంలోని ప్రతి ఒక్కరూ ఆర్థిక సాధికారత సాధించేందుకు ఫిన్‌టెక్ విప్లవం అవసరమని, టెక్నాలజీ ఫైనాన్స్‌లో అతిపెద్ద మార్పులు వస్తున్నాయని, గతేడాది మొబైల్ చెల్లింపులు ఏటీఎం విత్‌డ్రాల కంటే అధికంగా ఉన్నాయన్నారు.
భారతీయ డిజిటల్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ఉండటమే ఈ రంగం ప్రగతికి కారణం. ఇన్‌కమ్, ఇన్వెస్ట్‌మెంట్, ఇన్సూరెన్స్, ఇన్‌స్టిట్యూషన్ల్ క్రెడిట్ వంటి నాలుగు స్తంభాలపై ఫిన్‌టెక్ పరిశ్రమ ఆధారపడి ఉందని మోదీ తెలిపారు. ఆదాయం పెరిగితే పెట్టుబడులకు వీలవుతుంది. బీమా వల్ల రిస్క్ సామర్థ్యం వృద్ధి సాధ్యమవుతుంది. ఫిన్‌టెక్ పరిశ్రమ విజయానికి ప్రధానంగా సమగ్రత, ఉమ్మడి శ్రేయస్సే కారణమన్నారు. ఫిన్‌టెక్ ద్వారా ప్రజల్లో సాధికారత పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, గత ఏడేళ్ల కాలంలో సుమారు 43 కోట్ల జన్‌ధన్ ఖాతాలే దీనికి సాక్ష్యమన్నారు. అలాగే, ఇప్పటివరకు 69 కోట్ల రూపే కార్డుల జారీ అయ్యాయన్నారు.
అదేవిధంగా దేశీయంగా అభివృద్ధి చెందిన యూపీఐ ద్వారా గత నెలలో 420 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. ఇదే కార్యక్రమంలో మాట్లాడిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ క్రిప్టోతో పోలిస్తే బ్లాక్‌చెయిన్ చాలా భిన్నమైన టెక్నాలజీ అని చెప్పారు. ‘బ్లాక్‌చెయిన్ అనే టెక్నాలజీని నమ్ముతున్నాను. ఇది క్రిప్టో కంటే భిన్నంగా ఉంటుంది. బ్లాక్‌చెయిన్‌ని ఉపయోగించి, మెరుగైన భద్రత, నమ్మకం, ఆటోమేషన్, సామర్థ్యాన్ని దాదాపు ఏ రకమైన లావాదేవీలకైనా అందించగలమని’ అంబానీ అన్నారు. కాబట్టి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఉపయోగించి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, స్మార్ట్ టొకెన్, డిజిటల్ విధానాన్ని మార్చేందుకు ఫిన్‌టెక్ రంగం ద్వారానే సాధ్యమని నమ్ముతున్నట్టు ముఖేష్ అంబానీ వెల్లడించారు.