- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ.26 కోట్లతో నెక్లెస్ రోడ్డు ఆధునీకరణ
దిశ, న్యూస్‌బ్యూరో: జంటనగరాలను కలిపే నెక్లెస్ రోడ్డును మరింత ఆధునీకరించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్ణయించింది. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నెక్లెస్ రోడ్డు సుందరీకరణ పనులు చేపడుతోంది. ప్రస్తుతమున్న బ్లాక్ టాప్ రోడ్డు(బీటీ రోడ్)ను వాక్యూమ్ డీవాటర్డ్ సిమెంట్ కాంక్రీట్ (వీడీసీసీ) రోడ్డుగా మార్చే పనులకు హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టింది. రూ.26 కోట్ల వ్యయంతో 6 కిలోమీటర్ల పొడవున వీడీసీసీ రోడ్డు పనులు హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి పర్యవేక్షణలో ఇంజినీరింగ్ అధికారులు చేపట్టారు. నెక్లెస్ రోడ్డు ప్రారంభం (ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహం) నుంచి సికింద్రాబాద్ బుద్ధభవన్ సేలింగ్ క్లబ్ వరకు ఈ రోడ్డు వేస్తున్నారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
tag: Necklace Road Modernization, VDCC Road, HMDA, Khairatabad, Secunderabad, Buddha Purnima Project