కర్నూలులో భారీగా వెండి పట్టివేత..

by Anukaran |
కర్నూలులో భారీగా వెండి పట్టివేత..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లాలో భారీగా వెండి పట్టుబడింది. జిల్లాలోని డోన్ మండలం అమకతాడు టోల్ ప్లాజా వద్ద గురువారం సాయం కాలం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ కారులో భారీగా తరలిస్తున్న వెండిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వెండి సుమారు 400 నుంచి 500 కిలోలు ఉంటుందని సమాచారం.

ఆ సమయంలో నిందితులు రాయ్ పూర్ నుంచి శేలంకు కారులో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెండికి సంబంధించి ఎలాంటి రశీదులు లేని కారణంగా స్వాధీనం చేసుకున్న వెండిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story