భారత్‌లో ఒక్కరోజే 83,883 కేసులు..

by Anukaran |
భారత్‌లో ఒక్కరోజే  83,883 కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. వైరస్ నివారణకు కేంద్రం పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నా.. కరోనా వ్యాప్తి తీవ్రతలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అయితే, దేశంలో రికవరీ రేటు పెరుగుతుండటం కొద్దిగా ఊరట కలిగించే అంశం. తాజాగా కేంద్ర వైద్యారోగ్య విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 83,883 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 38,53,407కు చేరుకుంది. ప్రస్తుతం 8,15,538 యాక్టివ్ కేసులున్నాయి.

గడచిన 24గంటల్లో 68,585 మంది డిశ్చార్జి అవ్వగా.. మొత్తంగా 29,70,493మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో 1,043 మంది మృతి చెందగా, ఇప్పటివరకు 67,376 కరోనా మరణాలు సంభవించాయి.

Advertisement

Next Story

Most Viewed