డ్రగ్స్ కేసులో రకుల్ పేరుపై ఎన్సీబీ కీలక వ్యాఖ్యలు….

by Anukaran |
డ్రగ్స్ కేసులో రకుల్ పేరుపై ఎన్సీబీ కీలక వ్యాఖ్యలు….
X

దిశ వెబ్ డెస్క్:
నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్ సీబీ) కీలక వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి తన స్టేట్ మెంట్ లో ఏ బాలివుడ్ స్టార్ పేరు వెల్లడించలేదని ఎన్ సీబీ ప్రకటించింది. కేవలం డ్రగ్స్ స్మగ్లర్ల పేర్లను మాత్రమే రియా వెల్లడించినట్టు తెలిపింది. డ్రగ్స్ కేసులో 25 మంది బాలివుడ్ ప్రముఖుల పేర్లు ఉన్నాయన్న దాంట్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. రకుల్, సారాల పేర్లు జాబితాలో లేవని వెల్లడించింది. బాలివుడ్ స్టార్లకు సమన్లు జారీచేయడం లేదని ఎన్సీబీ తెలిపింది.

Advertisement

Next Story