- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారీగా పెరిగిన నజారా టెక్నాలజీస్ ఆదాయం
by Harish |

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మొబైల్ గేమ్ డెవలపర్ సంస్థ నజారా టెక్నాలజీస్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 84 శాతం పెరిగి రూ. 454.2 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గేమిఫైడ్ లెర్నింగ్, ఈ-స్పోర్ట్స్ వంటి విభాగాల్లో బలమైన వృద్ధిని సాధించినట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా కంపెనీ ఇదే స్థాయిలో వృద్ధిని కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది.
అలాగే, వినియోగదారుల నుంచి మెరుగైన స్పందనను సాధించామని కంపెనీ పేర్కొంది. గేమిఫైడ్ లెర్నింగ్ విభాగంలో కంపెనీ ఆదాయం 820 శాతం వృద్ధి నమోదైందని, ఈ-స్పోర్ట్స్ విభాగంలో ఆదాయం రూ. 84.2 కోట్ల నుంచి రూ. 170.1 కోట్లకు పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
Next Story