ప్రియుడితో అది అయిపోయిందని చెప్పిన స్టార్ హీరోయిన్.. షాక్ లో ఫ్యాన్స్

by Anukaran |   ( Updated:2021-08-10 23:23:07.0  )
nayanatara and vignesh shivan engegement
X

దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ జంట ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే గతకొన్నేళ్ళుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. పెళ్లి ఊసు ఎత్తకుండా కాలం గడుపుతున్న ఈ జంటకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా నయనతారనే వెల్లడించడంతో ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. నాలుగేళ్ళ క్రితం ‘నేను రౌడీ’ని చిత్ర షూటింగ్ లో వీరి పరిచయం మొదలయ్యింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటినుంచి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నా.. పెళ్లి గురించి ఇద్దరు ఒక్కసారి కూడా ఓపెన్ అవ్వలేదు.

ఇక ఇటీవల పెళ్లి వార్తలపై విఘ్నేష్ మాట్లాడుతూ ఈ ఏడాదిలోనే తమ పెళ్లి ఉంటుందని, అందుకు డబ్బులు కూడబెడుతున్నాం అంటూ క్లారిటీ ఇచ్చారు. నయన్ అయితే తమ పెళ్లి వార్తలపై ఎప్పుడు స్పందించను కూడా లేదు. అయితే తాజాగా నయన్ ఒక టీవీ షోలో తన పెళ్లిపై క్లారిటీ ఇస్తూ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. విఘ్నష్ తో రిలేషన్ షిప్ గురించి యాంకర్ అడుగగా.. తనకు ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందని, దానికి సంబంధించి రింగ్‌ను చూపించి అందరికి షాకిచ్చింది. గతంలో విఘ్నేష్‌ శివన్ గుండెల మీద చేయి వేసి రింగ్‌ ఉన్న ఫోటోను హైలేట్‌ చేస్తూ నయన్‌ ఓ పోస్ట్‌ షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఒక్కసారిగా ఈ విషయం విన్న అభిమానులు షాక్ కి గురైనా.. ఆమె ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల నయన్ తండ్రి కురియన్ కొడియట్టు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నయన్ త్వరగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. అందుకే త్వరలో వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరగనుంది. ఇకపోతే ప్రస్తుతం నయన్ నటించిన ‘నేత్రికన్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

https://twitter.com/i/status/1425030114404823042

Advertisement

Next Story