డ్రగ్స్‌ కేసుతో నష్టపోతున్న షారుఖ్.. హ్యాండ్ ఇచ్చిన నయనతార

by Shyam |
nAYANATARA1
X

దిశ, సినిమా: డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న కొడుకు ఆర్యన్ ఖాన్‌ను బయటికి తీసుకొచ్చేందుకు కింగ్ ఖాన్ షారుఖ్ సతమతమవుతున్నాడు. బెయిల్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్న తను.. షూటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ మేరకు ‘పఠాన్‌’ మూవీతోపాటు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లయన్’కు కూడా బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే, డేట్స్ వేస్ట్ అయిపోతున్న కారణంగా ఈ సినిమాలో ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయినట్లు సమాచారం. ఈ డెసిషన్ పూర్తిగా ప్రొఫెషనల్ కాగా.. అక్టోబర్‌తోపాటు నవంబర్ ఫస్ట్ హాఫ్‌ను అట్లీ మూవీకి కేటాయించింది నయన్. కానీ ఈ టైమ్‌లో షూటింగ్ జరగకపోవడం, తాను ఆల్రెడీ సైన్ చేసిన ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అట్లీ మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు టాక్.

Advertisement

Next Story