ఇది ఆరంభం మాత్రమే: సిద్దిఖీ భార్య

by  |
ఇది ఆరంభం మాత్రమే: సిద్దిఖీ భార్య
X

విభిన్న పాత్రల ద్వారా నవాజుద్దీన్ సిద్దిఖీ బాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ, ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. సిద్దిఖీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తూ తన భార్య అలియా సిద్దిఖీ విడాకులు కోరింది. ‘లాక్‌డౌన్ కారణంగా సోషల్ మీడియాలో నవాజుద్దీన్‌కు నోటీసులు పంపినా తను స్పందించలేదు. కానీ, పెళ్లైనప్చటి నుంచి నరకంలోనే ఉన్నానని.. తనను అత్తింటివారు చాలా వేధించారు’ అని చెప్పిన అలియాకు పెద్దగా సపోర్ట్ లభించకపోగా కొందరు విమర్శలకు కూడా దిగారు.

తాజాగా నవాజుద్దీన్ సిద్దిఖీ తమ్ముడు.. తనను బాల్యంలో వేధింపులకు గురిచేశాడని ఆయన మేనకోడలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ విషయంపై స్పందించిన అలియా సిద్దిఖీ.. ఇది ఆరంభం మాత్రమేనని అంటోంది. ఇప్పటి వరకు తనకు సపోర్ట్ ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపిన ఆమె.. ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసే మరెన్నో విషయాలు బయటకు రావాల్సి ఉందని అంటోంది. ‘చూద్దాం డబ్బు నిజాన్ని ఎంత వరకు కొంటుందో’ అని ట్వీట్ చేసింది అలియా.

Advertisement

Next Story

Most Viewed