ఆగస్ట్ 11న నవోదయ పరీక్ష..

by srinivas |
ఆగస్ట్ 11న నవోదయ పరీక్ష..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆగస్ట్ 11న జవహార్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (జేఎన్‌వీఎస్‌టీ)ని నిర్వహించనుట్టుగా కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. 6వతరగతిలో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన పరీక్షను కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నిర్వహిస్తున్నట్టుగా కేంద్ర విద్యాశాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తునట్టుగా చెప్పారు. విద్యార్థులు హాల్ టికెట్లను వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పరీక్షల ఫలితాల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

Advertisement

Next Story