Hunger strike for iPhone: ఛీ.. వీడసలు కన్నకొడుకేనేనా? ఐ ఫోన్ కోసం పూలమ్మే తల్లిపై కొడుకు ఫోర్స్

by Prasad Jukanti |
Hunger strike for iPhone: ఛీ.. వీడసలు కన్నకొడుకేనేనా? ఐ ఫోన్ కోసం పూలమ్మే తల్లిపై కొడుకు ఫోర్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమ బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అహర్నిశలు శ్రమిస్తూ పిల్లలే లోకంగా జీవిస్తుంటారు. అలాంటి తల్లిదండ్రులను సంతోషపరుస్తూ తమ జీవితాన్ని మలుచుకోవాల్సిన కొంత మంది పిల్లలు బాధ్యతారాహిత్యంగా నడుచుకుంటూ పేరెంట్స్ కు పెను భారంగా మారుతున్నారు. తాజాగా ఐ ఫోన్ కోసం గుడి ముందు పూలు అమ్ముకునే ఓ తల్లిని ఆమె సొంత కుమారుడు డిమాండ్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఐ ఫోన్ కోసం ఏకంగా 3 రోజుల పాటు తిండి తిప్పలు మాని ఒత్తిడి తేవడంతో చేసేందేమి లేక సదరు తల్లి ఐ ఫోన్ కోసం డబ్బు తెచ్చి చేతిలో పెట్టిన ఘటన వైరల్ గా మారింది. తల్లి ఇచ్చిన డబ్బుతో ఐ ఫోన్ స్టోర్ కు వెళ్లగా అక్కడి సిబ్బంది ఆ తల్లి కుమారుడిని ఇంటర్వ్యూ చేశారు. ఈ వీడియోతో ఐ ఫోన్ కోసం తన కుమారుడు చేసిన నిర్వాకాన్ని తల్లి బయటపెట్టింది. మొబైల్ కోసం తనపై ఒత్తిడి తెచ్చాడని, 3 రోజులు తిండి మానేయడంతో గత్యంతరం లేక ఫోన్ ఖరీదుకు సరిపడ డబ్బులు తెచ్చి ఇచ్చానని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఐ ఫోన్ కోసం తాను ఎంత డబ్బులను ఇచ్చానో ఆ డబ్బును సంపాదించి పెట్టాలని షరతు విధించానని చెప్పింది. ఈ వీడియోనును ఇంటర్నెట్ లో పోస్టు చేయయగా వైరల్ గా మారింది.

అయితే ఆ కుమారుడి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ కాలం యువతకు కష్టం విలువ తెలియదని కొందరు, ఇది సిగ్గుచేటు అని ఆ తల్లి డబ్బు ఇచ్చే బదులు చెప్పులతో కొట్టి ఆకలితో అలమటించేలా చేసి ఉండాల్సింది అని మరికొందరు కామెంట్స్ చేశారు. ఈ స్వార్థపూరిత బగ్గర్లు తమ దురాశ కోసం తమ సొంత తల్లిదండ్రులను విక్రయించడానికి వెనుకాడరని మరొకరు రాసుకొచ్చారు. కొంత మంది రిటైలర్లు మధ్యతరగతి ప్రజలు ఐ ఫోన్ కలిగి ఉండటం ఒక మైలురాయిగా భావించేలా ప్రచారం చేస్తున్నారని తప్పుబడ్డారు. మొత్తంగా ఈ వ్యవహారంలో ఐ ఫోన్ కోసం తల్లిని ఇబ్బందులు పెట్టిన తీరుపై నెటిజన్లు హార్ట్ బ్రేక్ సింబల్స్ తో స్పందింస్తున్నారు.

Advertisement

Next Story