- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకే.. వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో : లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి బిడ్డ, ఎమ్మెల్సీ కవిత మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ కొత్తరాగం అందుకున్నారని, ఇది చాలా విడ్డూరంగా ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల చురకలంటించారు. బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్టుందని ఆమె ఎద్దేవాచేశారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ మహిళలకు 33 శాతం సీట్లు ఎందుకు కేటాయించలేదో ముందు సమాధానం చెప్పాలని షర్మిల శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
2014 ఎన్నికల్లో మహిళలకు ఇచ్చింది 6 సీట్లు అంటే 5.88 శాతమని, ఇదేనా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇచ్చే గౌరవమని ఆమె నిలదీశారు. 2018లో మహిళలకు 4 సీట్లు అంటే 3.36 శాతం సీట్లు మాత్రమే ఇచ్చారని, మహిళలకు ఇచ్చే మర్యాద ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. శాసనమండలిలో 34 మంది సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కేవలం మూడు సీట్లు మాత్రమనని, ఇది 8.82 శాతం మాత్రమేనని ఆమె విమర్శలు చేశారు. దీన్ని బట్టి మహిళలపై రాష్ట్రప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని ఆమె విరుచుకుపడ్డారు. 17 పార్లమెంట్ స్థానాలకు మహిళలకు రెండు సీట్లు కేటాయించారని, అంటే 11.76 శాతం మాత్రమేనని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ తొలి క్యాబినెట్ లో మహిళలకు చోటు కల్పించలేదని, ఇప్పుడున్న క్యాబినెట్ లో పట్టుమని ఇద్దరు మంత్రులున్నారన్నారు. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు వచ్చిన అడ్డంకి ఏంటని షర్మిల ప్రశ్నించారు. కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని, ప్రగతిభవన్, ఫాంహౌజ్ ఎదుట అని సూచించారు. ఎమ్మెల్సీ కవిత.. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడి, మహిళలకే తలవంపు తెచ్చారని షర్మిల ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ స్కాంను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలని కవితపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.