నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో యువజన కాంగ్రెస్ నిరసన

by Harish |
నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో యువజన కాంగ్రెస్ నిరసన
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ పేపర్ లీక్‌ ఘటనపై భారత యువజన కాంగ్రెస్ గురువారం దేశ రాజధానిలో నిరసన చేపట్టింది. దీనిలో వందలాది మంది పాల్గొని ప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంతో విఫలం అయ్యారని పేర్కొంటూ కేంద్రంపై విమర్శలు చేశారు. విద్యవ్యవస్థ పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర అశాంతి నెలకొంది, పేపర్‌ లీక్‌ ఘటనతో బాధపడుతున్న విద్యార్థుల గొంతుకగా వేలాది మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీ వీధుల్లోకి వచ్చారని యువజన కాంగ్రెస్‌ చీఫ్‌ బీవీ శ్రీనివాస్‌ అన్నారు. కాంగ్రెస్ జెండాలు పట్టుకుని వందలాది మంది కార్యకర్తలు నిరసన తెలుపుతున్న ఫొటోలను ఇండియన్ యూత్ కాంగ్రెస్ తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.

ఇదిలా ఉంటే నీట్ ఉదంతంపై ఇతర వర్గాల నుంచి కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ NEET-PG 2024 పరీక్షను వాయిదా వేసింది, కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ప్రభుత్వం NTA చీఫ్‌ని భర్తీ చేసింది, దాని పనితీరును సమీక్షించడానికి, మెరుగుపరచడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అంశానికి సంబంధించిన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు జులై 8న విచారించనుంది. ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్న బీహార్ ప్రభుత్వం, విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించింది.

Advertisement

Next Story

Most Viewed