మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు: బీజేపీ MP బ్రిజ్ భూషణ్‌కు యోగీ సర్కార్ షాక్!

by Satheesh |   ( Updated:2023-06-02 12:31:28.0  )
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు: బీజేపీ MP బ్రిజ్ భూషణ్‌కు యోగీ సర్కార్ షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. యూపీలో ప్రముఖ స్థలమైన అయోధ్యలో ఈ నెల 5వ తేదీన తన అనుచరులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించాలని బ్రిజ్ భూషణ్ ముందుగా నిర్ణయించారు. కాగా, ర్యాలీకి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న సమయంలో ఆకస్మింగా అయోధ్య బైక్ ర్యాలీని వాయిదా వేస్తున్నటు ఇవాళ ప్రకటించారు.

అయితే, బ్రిజ్ భూషణ్ తన బైక్ ర్యాలీని ఉన్నట్లుండి వాయిదా వేయడానికి కారణం యోగీ సర్కార్ అనుమతి నిరాకరించడమేనని సమాచారం. ఈ నెల 5వ తేదీన అయోధ్యలో బ్రిజ్ భూషణ్ బైక్ ర్యాలీకి యూపీ సర్కార్ పర్మిషన్ ఇవ్వకపోవడంతోనే ర్యాలీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా రెజ్లర్లు దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు నెల రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ ఆందోళన తీవ్ర స్థాయిలో ఉండటం.. అంతేకాకుండా మహిళా రెజ్లర్ల నిరసన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారడం.. ఇలాంటి సమయంలో అతడికి ర్యాలీకి పర్మిషన్ ఇస్తే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతాయనే యోగీ సర్కార్ అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇక, ఉత్తరప్రదేశ్‌లోని యోగీ సర్కార్ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకపోవడంతో బ్రిజ్ భూషణ్ మరో తేదీకి తన ర్యాలీని వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

Also Read..

రెజ్లర్ల ఇష్యూపై 1983 వరల్డ్ కప్ విజేతల రియాక్షన్ ఇదే

Advertisement

Next Story

Most Viewed