ఐటీ రాజధాని బెంగళూరులో ఎల్లో అలర్ట్ ...

by Shiva |
ఐటీ రాజధాని బెంగళూరులో ఎల్లో అలర్ట్ ...
X

దిశ, వెబ్ డెస్క్ : భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ బెంగళూరుతో (ఐఎండీ) పాటు కర్ణాటకలోని మరో పది జిల్లాల్లో మే 31 వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. బెంగళూరు చాప్టర్ సబ్‌ వే లు, చిన్నపాటి ట్రాఫిక్ రద్దీ, కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలిపోయే అవకాశం ఉందని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

కొడగు, మైసూరు, శివమొగ్గ, చిత్రదుర్గ, హాసన్, గుల్బర్గా, ఉడిపి, చామరాజ్‌నగర్, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు సహా పది జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు బెంగళూరులో మొత్తం 19 మి.మీ వర్షపాతం నమోదైంది. బెల్లందూర్ వంటి టెక్ కారిడార్‌లో తాగు నీటి ఎద్దడి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం.. సాంకీ రోడ్, లింగరాజపురం సమీపంలోని అండర్‌పాస్‌ నిన్న రాత్రి పూర్తిగా నీటితో నిండిపోయాయి.

మరోవైపు ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ట్రాఫిక్‌ స్తంభించి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ విషమంలో కమిషనర్లు, జాయింట్ కమిషనర్లతో సహా ఉన్నత స్థాయి అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో 'పౌరులందరి భద్రత ముఖ్యం..! దయచేసి అప్రమత్తంగా ఉండండి, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి' అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed