- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూత్ డ్రీమ్ బైక్.. Rx100 మళ్ళీ రాబోతుంది!
దిశ, డైనమిక్ బ్యూరో: యూత్ డ్రీమ్ బైక్ అయిన యమహా Rx100 కొత్త అవతార్‌లో భారతదేశానికి తిరిగి రాబోతున్నట్లు సమాచారం. 1980 కాలం నుంచి ఉన్న ఈ బైక్.. కచ్చా రోడ్ లో సైతం సునాయసంగా స్పీడ్‌తో వెళ్లేది. ఆ బైక్ లూక్ ఒక ఐకానిక్, మిడిల్ క్లాస్ నుంచి రిచ్ పీపుల్ వరకు ఆ బైక్ ఒక్కసారైనా నడపాలనే కోరిక ఉండేది. బైక్ ఇంజన్ ఇచ్చే సౌండ్, దాని వేగం అంటే కుర్రకారు పిచ్చెక్కిపోయేవారు.అయితే, యమహా కంపెనీ కొన్నేళ్ల క్రితం ఈ బైక్‌ను నిలిపివేసింది.
తాజాగా ఇప్పుడు దీన్ని మళ్లీ మార్కెట్‌లోకి తేవాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ బైక్ ఇంజన్ 225 సీసీ ఇంజన్ కలిగి ఉంటుందని, డిజైన్ మాత్రం Rx100ను కలిగి ఉంటున్నట్లు తెలిసింది.
అయితే దీని గురించి యమహా కంపెనీ ఇంకా ఏమీ ధృవీకరించలేదు. మరోవైపు ఇలాంటి నివేదిక రావడం ఇదే మొదటిసారి కాదు. 2022 లో కూడా యమహా RX100 గురించి యమహా ఇండియా ప్రెసిడెంట్ ఇషిన్ చిహానా RX100 మళ్లీ కనిపిస్తుందని పేర్కొన్నారు. దాని ప్రస్తుత మోనికర్‌ను అలాగే ఉంచుతుందని అతను చెప్పాడు. కాగా, యమహా 1985 నుంచి 1996 వరకు టూ-స్ట్రోక్ మోటార్‌సైకిల్‌ను తయారు చేసింది. యమహా RX 135 4 స్పీడ్ (మినీ-క్యాట్) 2005 వరకు దాని అప్‌గ్రేడ్ వర్షన్లను తీసుకవచ్చింది.