- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ayodhya Rama: అయోధ్య బాల రాముడు ఫొటోతో ప్రపంచంలోనే మొట్ట మొదటి స్టాంపు విడుదల
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత.. అధికారికంగా.. రామ మందిరంలో శ్రీరాముడి బాల విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే ఈ శ్రీరాముడి బాల విగ్రహాన్ని.. లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ (లావో పిడిఆర్) పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. దీంతో హిందూ దేవుడిని చిత్రీకరించే స్టాంపును విడుదల చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ నిలిచింది. భారతదేశం, లావో పిడి ఆర్ మధ్య లోతైన పాతుకుపోయిన నాగరికత, సాంస్కృతిక సంబంధాలు హైలైట్ చేస్తూ భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ దేశ పర్యటన సందర్భంగా ఈ స్టాంప్ విడుదల చేశారు. లావోస్ రాజధాని వియంటియాన్‌లో జరిగిన కార్యక్రమంలో జైశంకర్, లావో పిడిఆర్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి సలెమ్‌క్సే కొమ్మసిత్ సంయుక్తంగా శ్రీరామ్ లల్లా యొక్క ప్రత్యేక స్మారక తపాలా స్టాంపును ఆవిష్కరించారు.
లావోస్‌లోని భారత రాయబారి ప్రశాంత్ అగర్వాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసియాన్ సమావేశాల కోసం డాక్టర్ జైశంకర్ ఆగ్నేయాసియా దేశాన్ని సందర్శించిన సందర్భంగా ఇది జరిగింది. స్టాంప్ సెట్‌లో రెండు ప్రత్యేకమైన స్టాంపులు ఉన్నాయి. అందులో ఒకటి లావోస్ యొక్క పురాతన రాజధాని, ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన లుయాంగ్ ప్రబాంగ్ యొక్క లార్డ్ బుద్ధుని వర్ణిస్తుంది. రెండో దాంట్లో అయోధ్యకు చెందిన శ్రీ రామ్ లల్లా విగ్రహాన్ని ప్రింట్ చేశారు. బౌద్ధమతం చారిత్రాత్మకంగా భారతదేశం, లావో PDR మధ్య లోతైన సంబంధాన్ని ఏర్పరుచుకుంది. భారతదేశం బౌద్ధమతానికి జన్మస్థలం, విశ్వాసానికి సంబంధించిన అనేక కీలకమైన ప్రదేశాలకు నిలయంగా ఉంది.