- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్.. ఎక్కడంటే.?
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ ను.. భారత ఆర్మీ, వాయుసేన సంయుక్తంగా దేశంలోని ఒక మారుమూల ప్రాంతానికి డెలివరీ చేసినట్లు తెలుస్తోంది. సొంతంగా రూపొందించిన ఈ పోర్టబుల్ హాస్పిటల్ ను ఐఏఎఫ్ కు చనిదినా రవాణా విమానం ద్వారా.. సుమారు 15 వేల అడుగుల ఎత్తు నుంచి అనుకున్న లక్షిత ప్రాంతంలో పారాచ్యుట్ సహాయంతో జారవిడిచింది. విపత్కర సమయాల్లో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఈ ఆపేరేషన్ ను నిర్వహించాయి భారత దళాలు. ఈ ఆపేరేషన్ లో ట్రామా కేర్ తదితర సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ లను తరలించారు.
అయితే.. భారత్ హెల్త్ ఇనీషియేటివ్ ఫర్ సహయోగ్ హిత మైత్రి (ప్రాజెక్ట్ - బీహెచ్ఐఎస్ హెచ్ఎం) ను దేశీయంగా అభివృద్ధి చేశారు. ఈ పోర్టబుల్ హాస్పిటల్ ను తరలించేందుకు ఐఏఎఫ్ అధునాతన సి -130 జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని భారత వాయుసేన ఉపయోగించింది. ఈ కీలక ఆపేరేషన్ లో భారత ఆర్మీకి చెందిన పారా బ్రిగేడ్ ముఖ్య పాత్ర పోషించింది.