- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారతీయులు సంతోషంగా లేరు

- 147 దేశాలకు గాను భారత్ 118వ స్థానం
- మన కంటే పాకిస్తాన్, ఉక్రెయిన్ వాసులకే ఎక్కువ ఆనందం
- ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండ్
- వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2025 విడుదల
దిశ, నేషనల్ బ్యూరో: సంతోషంగా గడపాలన్నదే ప్రతీ మనిషి కోరుకునేది. మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని వైద్యులు చెబుతుంటారు. అయితే ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారనే అంశంపై ఐక్యరాజ్య సమితి ఒక సర్వే నిర్వహించింది. వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2025 పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్టులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది హ్యాపినెస్ ఇండెక్స్‌లో ఇండియా 147 దేశాలకు గాను 118వ స్థానంలో నిలిచింది. 2024లో ఇండియా 126వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఎనిమిది స్థానాలు మెరుగుపరుచుకొని 118కి చేరింది. అయితే ఉక్రెయిన్, మొజాంబిక్, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, పాలస్తీనా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, గాంబియా, వెనిజులా వంటి దేశాలు ఇండియా కంటే సంతోషంగా ఉన్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్, యుద్దంతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌లు భారత్ కంటే సంతోషంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక ఫిన్లాండ్ దేశం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. గత ఎనిమిదేళ్లుగా ఈ దేశం నంబర్ 1 స్థానంలో ఉండటం గమనార్హం.
ప్రపంచంలోని 147 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించారు. ఆయా దేశాల్లోని పౌరుల జీవన నాణ్యత ఎలా ఉందనే అంశం ఆధారంగా రేటింగ్స్ ఇస్తారు. పౌరులు తమ ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడం, సామాజిక మద్దతు కోసం ఆధారపడటం, నివసిస్తున్న ఇంటి పరిమాణం వంటి అంశాలు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారనే విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. తాజా పరిశోధనలో ఇతరుల దయ, నమ్మకం పొందడం అనే అంశాన్ని కూడా చేర్చారు.
ఇండియా ఏ విధంగా మెరుగు పడింది?
హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో ఇండియా స్కోర్ 4.389కి చేరింది. దేశ తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవితం, ఆయుర్దాయం, దాతృత్వం, అవినీతిపై అవగాహన వంటి అంశాలతో కూడిన విషయాలను ర్యాంకింగ్‌లో కీలకంగా తీసుకున్నారు. అయితే దాతృత్వం, అవినీతిపై అవగాహన వంటి విషయాలు భారతీయుల విషయంలో ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.హ్యాపినెస్ రిపోర్ట్ 2024లో ఇండియా 4.054 స్కోర్ సాధించింది. బ్రిక్స్ దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. బ్రిక్స్ వెలుపల ఉన్న ఫిన్లాండ్ 7.741 స్కోరుతో అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా 6.725 స్కోరుతో మెరుగైన స్థానంలో ఉంది. 2024 నివేదిక ప్రకారం 30 నుంచి 44 ఏళ్ల మధ్య గల భారతీయులు అతి తక్కువ సంతోషంగా ఉన్నట్లు గుర్తించారు. 2006-10 నుంచి 2021-23 వరకు ఈ హ్యాపినెస్ స్కోర్ 1.124కు తగ్గింది. 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న భారతీయ యువత ఇతర దేశస్తులతో పోలిస్తే అత్యంత సంతోషంగా ఉన్నట్లు గుర్తించారు.