- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Wrestlers Protest: ఆందోళనను వాయిదా వేసుకున్న మహిళా రెజ్లర్స్
దిశ, వెబ్‌డెస్క్: భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రెజ్లర్ల ఆందోళనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన రెజ్లర్లు.. ఈ నెల 15వ తేదీ వరకు వారి ఆందోళనను తాత్కలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, బుధవారం కేంద్ర ప్రభుత్వంతో భారత మహిళ రెజ్లర్లు జరిపిన చర్చలు ముగిశాయి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా రెజ్లర్లు ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించేందుకు ఈ నెల 15 వరకు గడువు కావాలని.. అప్పటి వరకు ఆందోళన విరమించాలని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లకు సూచించారు. మంత్రి సూచన పట్ల సానుకూలంగా స్పందించిన రెజ్లర్లు ఈ నెల 15వ తేదీ వరకు తమ ఆందోళనను తాత్కలికంగా వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇక, తమపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాంటూ భారత మహిళ రెజ్లర్లు గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని.. లేదంటే తమ పథకాలను గంగా నదిలో పడేస్తామని రెజ్లర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాజాగా, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన రెజ్లర్లు వారి ఆందోళనను తాత్కలికంగా వాయిదా వేసుకున్నారు.