- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా లాయర్ని ఇష్టారీతిన కాళ్లతో తన్నుతూ.. ఘోరాతి ఘోరం! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః భారత మాతంటూ దేశాన్ని స్త్రీతో పోల్చుతారు. స్త్రీలను గౌరవించే దేశం మనదంటూ విపరీతంగా ప్రచారం కూడా చేస్తుంటారు. కానీ, నానాటికీ ఇక్కడ స్త్రీలపై అఘాయిత్యాలు మాత్రం ఆగవు ఎందుకో..?! ఇటీవల కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని వినాయక్ నగర్ సమీపంలో ఓ మహిళా న్యాయవాదిపై ఆమె పొరుగింటి వ్యక్తి తీవ్రంగా దాడి చేశాడు. కడుపు కాలుతో తన్నుకుంటూ, మొహం పైన పిడిగుద్దులు గుద్దుకుంటూ.. పదే పదే కొట్టి, కొట్టి, తోసేస్తున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. కెమెరాకు చిక్కిన ఈ షాకింగ్ ఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్నట్లు సమాచారం.
సంగీత అనే మహిళా న్యాయవాది తన పొరుగింటి మహంతేష్ తనపై దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంతేష్ మగ అహంకారాన్ని చూపించే ఈ అవమానకరమైన ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు పరిశీలించారు. కేసును విచారించి, బాగల్‌కోట్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక, వీరిరువురి మధ్య ఏదో సివిల్ వివాదానికి సంబంధించి వ్యక్తిగత శత్రుత్వం ఉందని, గతంలోనూ పాత సివిల్ కేసుపై వీరిద్దరు పలుమార్లు గొడవ పడ్డారని సమాచారం. ఏదేమైనా, ఈ వైరల్ వీడియోలో, నిందితుడు మహిళను ఇష్టారీతిన తన్నుతుంటే అక్కడ చాలా మంది చోద్యం చూశారు తప్ప ఒక్క వ్యక్తి కూడా ఆ అహంకారిని వారించకపోవడం నేటి సమాజంలో నెలకొన్న అధ్వాన్న పరిస్థితికి అద్దం పడుతుందని నెటిజన్లు మండిపడుతున్నారు.
Trigger warning: A lawyer was brutally assaulted by a man named Mahantesh in Vinayak nagar, Bagalkot, Karnataka. pic.twitter.com/kZ3OpUeKbi
— Mohammed Zubair (@zoo_bear) May 14, 2022