Woman Cop: అర్ధరాత్రి ఒంటరిగా ఆటో ఎక్కిన లేడీ పోలీసు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

by Prasad Jukanti |
Woman Cop: అర్ధరాత్రి  ఒంటరిగా ఆటో ఎక్కిన లేడీ పోలీసు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా మహిళల రక్షణ విషయంలో ఇంకా వెనుకబడిపోయాం. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. రేపిస్టులు, హంతకులు ఏ మాత్రం భయపడుకుండా దారుణాలకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో అర్థరాత్రి ఒంటరిగా ఆటోలో ప్రయాణిస్తూ హెల్ప్ కోసం ఎమర్జెన్సీ నంబర్ కు ఫోన్ చేసిన లేడీ పోలీసుకు ఎదురైన అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

అర్థరాత్రి మహిళల సేఫ్టీ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆగ్రా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (ఏసీపీ) సుకన్య శర్మ శనివారం అర్థరాత్రి సాధారణ టూరిస్టుగా అవతారమెత్తారు. తొలుత ఆమె ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ బయట నిలబడి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ నంబర్ కు కాల్ చేశారు. తాను నగరానికి కొత్తగా వచ్చానని రోడ్లన్ని నిర్మానుష్యంగా ఉన్నాయని, తనకు భయమేస్తోందని సహాయం చేయాలని కోరింది. స్పందించిన హెల్ప్ లైన్ టీమ్ ఆమెను సురక్షిత ప్రదేశంలో నిలబడాలని సూచించారు. ఆమె వివరాలు సేకరించారు. ఆ వెంటనే పెట్రోలింగ్ టీమ్ నుంచి సుకన్య శర్మకు ఫోన్ కాల్ వ్చచింది. మీరు భయపడవద్దు.. ధైర్యంగా ఉండండి.. మేము మిమ్మల్ని తీసుకువెళ్లడానికి వస్తున్నామని సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే సుకన్య శర్మ అసలు విషయం చెప్పారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ పరిశీలిస్తున్నానని ఈ పరీక్షలో మీరు పాసయ్యారు వారికి సమాధానం ఇచ్చారు.

అనంతరం ఆమె ఓ ఆటో ఎక్కారు. ఎక్కడ దిగాలో చెప్పి ఎంత చార్జ్ అవుతుందో తెలుసుకున్నారు. తానెవరో చెప్పకుండానే ఒంటరిగా ఆ ఆటోలో ఆమె ప్రయాణించారు. జర్నీ సమయంలో నగరంలో మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై డ్రైవర్ తో సుకన్య శర్మ మాట్లాడారు. అయితే తన ఆటోను పోలీసులు వెరిఫై చేశారని సదరు డ్రైవర్ చెప్పుకొచ్చారు. ఆమెను సురక్షితంగా దిగాల్సిన చోట దింపేశాడు. మహిళల సేఫ్టీ విషయంలో అర్ధరాత్రి పూట ఇటు ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టమ్ ను, అటు ఆటోవాలాల పరిస్థితిని పరిశీలించిన సుకన్య శర్మపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల భద్రత విషయంలో సుకన్య శర్మది సరైన మొదటి అడుగు అని, అర్ధరాత్రి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు పోలీసులు సామాన్యులుగా మారాలని సామాజిక కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు. సుకన్య శర్మకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Next Story