- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేతులు జోడించి అడుగుతున్నా.. మోడీ ఏం చేశారో చెప్పాలన్న తేజస్వి యాదవ్
దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రసంగం వివాదాస్పదంగా మారింది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందితే దేశ సంపదను చొరబాటుదారులకు పంచిపెడుతుందని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ) నేత తేజస్వి యాదవ్ ఉద్వేగంతో స్పందించారు. ' నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. చేతులు జోడించి అడుగుతున్నాను.. దయచేసి మోడీ అసలు సమస్యలపై మాట్లాడండి. ఈ విద్వేష రాజకీయాలను పక్కన పెట్టండి. దేశ యువత, వృద్ధులు, రైతులు, వ్యాపారులు, తల్లులు ప్రజలందరికీ ఒకే రకమైన సమస్యలు ఉన్నాయి' అని అన్నారు. అందరికీ ఒక్కటే సమస్య. పెరుగుతున్న నిత్యావసర ధరలను భరించేందుకు, పేదరికం నుంచి బయటపడేందుకు ఉద్యోగాల కోసం చూస్తున్నారు. కాబట్టి ఈ వాస్తవ సమస్యలపై చర్చించి, గత 10 ఏళ్లలో మీరు దేశానికి, బిహార్‌కు ఏమి చేసారో చెప్పాలని నేను మళ్లీ మళ్లీ ప్రధానమంత్రిని కోరుతున్నాను' అని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. దేశం, బిహార్ కోసం ఉద్దేశించిన నిజమైన విజన్ ఏంటో చెప్పండి. కానీ, మోడీ దాని గురించి మాట్లాడరు. ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిసారీ దేవాలయం, ముస్లింల గురించి మాత్రమే మాట్లాడతారని వెల్లడించారు.