Kohinoor వజ్రం భారత్‌కు తిరిగి వస్తుందా?

by Rajesh |   ( Updated:2022-09-10 13:23:31.0  )
Kohinoor  వజ్రం భారత్‌కు తిరిగి వస్తుందా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలో అత్యంత విలువైన కోహినూర్ వ‌జ్రం ఇండియాలోనే ల‌భించింది. ఒక‌ప్పుడు భార‌త్‌లో బంగారం, వ‌జ్రాలు వంటివి విరివిగా ల‌భించేవి. అయితే ఈ వ‌జ్రం ఇప్పుడు యూకేలో ఉంది. 105.6 క్యారెట్ల విలువైన ఈ కోహినూర్ వ‌జ్రం కాక‌తీయుల కాలంలో అంటే 14వ శ‌తాబ్దంలో దొరిక‌న‌ట్లు చ‌రిత్ర చెబుతుంది. ఈ వ‌జ్రం దేశంలో రాజులు, చ‌క్రవ‌ర్తుల చేతులు మారుతూ చివ‌ర‌కు కాశ్మీర్ మ‌హారాజు దులీప్ సింగ్ వ‌ద్దకు చేరింది. లాహోర్ ఒప్పందంలో భాగంగా మ‌హారాజు దులీప్ సింగ్ ఆ వ‌జ్రాన్ని బ్రిటీష‌ర్లకు అప్పగించారు.

అప్పటి నుంచి కోహినూర్ వ‌జ్రం బ్రిటీష్ వారి వ‌ద్దనే ఉండిపోయింది. ఈ వ‌జ్రాన్ని తిరిగి భార‌త్‌కు ర‌ప్పించేందుకు 1947 నుంచి పోరాటం చేస్తున్నారు. భార‌త‌దేశానికి స్వాతంత్రం వ‌చ్చిన త‌రువాత మ‌హాత్మాగాంధీ ఈ వ‌జ్రం తిరిగి ఇవ్వాల‌ని బ్రిటీష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ, ఆ విజ్ఞప్తిని బ్రిటీష్ ప్రభుత్వం తిర‌స్కరించింది. ఆ త‌రువాత కూడా భార‌త ప్రభుత్వం కోహినూర్ వజ్రం కోసం ప్రయ‌త్నాలు చేస్తూనే ఉంది.

అయితే, ఈ కోహినూర్ వ‌జ్రాన్ని మ‌హారాణి తన కిరీటంలో అలంక‌రించుకున్నారు. కోహినూర్ వ‌జ్రం ద‌క్షిణ భార‌త‌దేశంలో దొర‌క‌డం, ఆ త‌రువాత ఉత్తరాది రాజుల చేతికి వెళ్లడంతో ఈ వ‌జ్రం త‌మ‌దంటే త‌మ‌ద‌ని పాకిస్తాన్‌, ఇరాన్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ దేశాలు కూడా పోరాటం చేస్తున్నాయి. కోహినూర్ వ‌జ్రం త‌మ‌కు ఇవ్వాలంటే త‌మ‌కే ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, బ్రిట‌న్ మాత్రం కోహినూర్ వ‌జ్రాన్ని తిరిగి ఇచ్చేందుకు స‌సేమిరా అంటుంది. ఇక, ఈ వజ్రం ఎవరి చెంతకు చేరనుందో చూడాల్సి ఉంది.

Advertisement

Next Story