'సీబీఐ ఏమీ తేల్చలేకపోతే ప్రధాని రాజీనామా చేస్తారా?'

by Vinod kumar |   ( Updated:2023-09-28 12:56:54.0  )
సీబీఐ ఏమీ తేల్చలేకపోతే ప్రధాని రాజీనామా చేస్తారా?
X

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని సీఎం అధికారిక బంగ్లా పునరుద్ధరణ పనులపై సీబీఐ విచారణకు ఆదేశించడంపై మండిపడ్డారు. ఒకవేళ ఈ దర్యాప్తులో సీబీఐకి ఎలాంటి ప్రూఫ్స్ దొరకకుంటే రాజీనామా చేసేందుకు ప్రధాని మోడీ సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజనలో భాగంగా అయోధ్యకు బయలుదేరిన భక్తులతో గురువారం ఉదయం నిర్వహించిన ‘భజన సంధ్య’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 75,000 మంది వృద్ధులు తీర్థయాత్రలకు వెళ్లొచ్చారని, వీరిలో 4 వేల మంది అయోధ్యను సందర్శించారని చెప్పారు. ఈ స్కీమ్‌కు ఎంపికయ్యే యాత్రికులందరికీ ఎయిర్ కండిషన్డ్ రైలు ప్రయాణం, వసతి, భోజనం, బోర్డింగ్, బస ఏర్పాట్లతో సహా మొత్తం ఖర్చును ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తోంది.

Advertisement

Next Story