Udhayanidhi Stalin : సనాతన ధర్మంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా

by Vinod kumar |   ( Updated:2023-11-06 13:42:41.0  )
Udhayanidhi Stalin : సనాతన ధర్మంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా
X

చెన్నై: తమిళనాడు మంత్రి, డీఎంకెకు చెందిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని, తానన్న మాటలకు కట్టుబడే ఉంటానని, అందుకోసం న్యాయపరంగా అన్ని సవాళ్లను ఎదుర్కొంటానని సోమవారం ఓ ప్రకటనలో స్టాలిన్ అన్నారు. అంబేద్కర్, పెరియార్‌లు మాట్లాడిన దానికంటే ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు. పార్టీ అధికారంలో ఉండటం, పార్టీలో తన స్థానం అనే విషయాల కంటే 'మనిషి' గా ఉండటం ముఖ్యమని భావిస్తున్నాను. ఇప్పుడున్న మంత్రి పదవి, ఎమ్మెల్యే, యూత్ వింగ్ సెక్రటరీ అనేవి రేపు ఉండకపోవచ్చు. కానీ, మనిషిగా మాటలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

నీట్ పరీక్ష ఆరేళ్ల సమస్య అయితే సనాతన ధర్మంపై కొన్ని శతాబ్దాలుగా మాట్లాడుతున్నామని, ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామని స్టాలిన్ వెల్లడించారు. కాగా, ఇటీవల ఉదయనిధి స్టాలిన్ ఓ సభలో మాట్లాడుతూ సనాతన ధర్మపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'సనాతన ధర్మాన్ని' నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఇది 'సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకమన్నారు. ఈ వ్యవహారంలో స్టాలిన్‌పై కేసు వేయగా, అందుకు మద్రాస్ హైకోర్టు విచారించింది. అధికారంలో ఉన్నవారు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయవద్దని జస్టిస్ జి జయచంద్రన్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed