- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bangladesh: షేక్ హసీనా భారత్‌లో కొనసాగితే ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం ఉండదు
దిశ, నేషనల్ బ్యూరో: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు పరిణామాలతో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి భారత్‌లో హసీనా ఆశ్రయం మరింతకాలం కొనసాగితే మనదేశంతో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందనే సందేహాలు నెలకొన్నాయి. దీనికి బదులిచ్చిన భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారు మొహమ్మద్ తౌహిద్ హుస్సేన్.. షేక్ హసీనా భారత్‌లో ఎక్కువ కాలం ఉండటం వల్ల ద్వైపాక్షిక సంబంధాలకు ఎలాంటి భంగం వాటిల్లదాని అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లడుతూ.. ఇది ఊహాజనితం. ఒక దేశంలో ఆమె ఉండటం వల్ల ఆ దేశంతో సంబంధాలపై ఎందుకు ప్రభావితమవుతాయి? అందుకు కారణాలు లేవని ' స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించినవి. ప్రయోజనాలు దెబ్బతిన్నప్పుడు స్నేహం కొనసాగదు అన్నారాయన. బంగ్లాదేశ్, భారత్‌లకు తమతమ స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. అవి సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. అలాంటి ప్రయోజనాలే భారత్‌తో మంచి సంబంధాలను కొనసాగించడానికి ఆస్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు.