Akhilesh Yadav : బుల్డోజర్ చర్యలకు క్షమాపణలు చెబుతారా ?.. యోగి సర్కారుకు అఖిలేశ్ ప్రశ్న

by Hajipasha |
Akhilesh Yadav : బుల్డోజర్ చర్యలకు క్షమాపణలు చెబుతారా ?.. యోగి సర్కారుకు అఖిలేశ్ ప్రశ్న
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. పోలీసు కేసుల విచారణ క్రమంలో స్థిరాస్తులను బుల్డోజర్లతో కూల్చొద్దని మంగళవారం రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాన్ని పాటించాలని యూపీ సర్కారును ఆయన కోరారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాల నేపథ్యంలో ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్‌లో జరిగిన బుల్డోజర్ చర్యలకు క్షమాపణలు చెబుతారా అని యోగి సర్కారును అఖిలేశ్ ప్రశ్నించారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘కొంతమందిపై ప్రతీకారం తీర్చుకోవడానికి, కించపర్చడానికి బుల్డోజర్ చర్యలను బీజేపీ సర్కారు వాడుకుంటోంది. బుల్డోజర్ చర్య అనేది అనాలోచితంగా తీసుకునే నిర్ణయం. స్టీరింగ్‌‌తో బుల్డోజర్‌ను నడపొచ్చు. బుల్డోజర్ స్టీరింగ్‌పై ఉన్న వాళ్లను మార్చేసే శక్తి యూపీ ప్రజలకు ఉంది’’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. ‘‘సీఎం యోగి నివాసం మ్యాప్‌కు అనుమతులు ఉన్నాయా ? అది ఎప్పుడు పాసైందో చెప్పండి ? పేపర్లు చూపించండి.. ’’ అని ఆయన ప్రశ్నలు గుప్పించారు. యూపీలోని అన్ని ప్రాంతాల పేర్లను మార్చేస్తున్న యోగి ఆదిత్యనాథ్.. భారతీయ జనతా పార్టీ పేరును భారతీయ జోగి పార్టీగా మార్చాలని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed