కమిషనర్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదు.. ప్రభుత్వానికి గుజరాత్ హైకోర్టు ప్రశ్న

by Harish |
కమిషనర్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదు.. ప్రభుత్వానికి గుజరాత్ హైకోర్టు ప్రశ్న
X

దిశ, నేషనల్ బ్యూరో: 27 మంది మృతికి కారణమైన రాజ్‌కోట్ గేమ్ జోన్ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి కేవలం జూనియర్ స్థాయి అధికారులను మాత్రమే సస్పెండ్ చేశారని, నగర మున్సిపల్ కమిషనర్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదని గుజరాత్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని ఒక అధికారి తెలిపారు. మే 25న రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో అగ్నిప్రమాదం జరగ్గా, ఈ ఘటనకు బాధ్యులుగా నగర మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఇద్దరు పోలీసు ఇన్‌స్పెక్టర్లు, సివిక్ సిబ్బందితో సహా ఏడుగురు అధికారులను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఘటనకు సంబంధించి మరో 13 మంది అధికారులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి కోర్టులో పిటిషన్ దాఖలైంది.

కోర్టు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. కేవలం జూనియర్ స్థాయి సిబ్బందిని మాత్రమే సస్పెండ్ చేశారని, నగర మున్సిపల్ కమిషనర్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే ఈ కేసులో భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 302ను ఎందుకు ప్రయోగించలేదని కూడా ప్రశ్నించిందని గుజరాత్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రిజేష్ త్రివేది తెలిపారు. తదుపరి విచారణను జూన్ 20వ తేదీకి వాయిదా వేసింది. మే 25న రాజ్‌కోట్ నగరంలోని గేమింగ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించగా, పిల్లలతో సహా 27 మంది మరణించారు.

Advertisement

Next Story

Most Viewed