Maharashtra CM: సీఎం పదవి విషయంలో ఎలాంటి వివాదం లేదు..దేవేంద్ర ఫడ్నవీస్

by Shamantha N |   ( Updated:2024-11-23 11:50:50.0  )
Maharashtra CM: సీఎం పదవి విషయంలో ఎలాంటి వివాదం లేదు..దేవేంద్ర ఫడ్నవీస్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) అధికార ‘మహాయుతి’ కూటమి ఘన విజయం సాధించింది. ఈ గెలుపుపై బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ (Devendra Fadnavis) స్పందించారు. ముంబైలోని మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోడీ వెంటే నిలిచారని ఫడ్నవీస్ అన్నారు. దానికి నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితాలని చెప్పుకొచ్చారు. ఇలాంటి భారీ విజయం సాధించడంలో సహకరించిన మహిళలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అసత్యాలు, తప్పుడు ఆరోపణలు ప్రచారం చేసిన ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెప్పారన్నారు. మతం ఆధారంగా ఓటర్లను వేరు చేయాలనుకున్న విపక్ష పార్టీల ప్రయత్నాలను జనం విఫలం చేశారన్నారు.

నెక్ట్స్ సీఎం ఎవరంటే?

మహారాష్ట్ర ఓటర్లు, పార్టీ శ్రేణులు, నేతల మద్దతు వల్లే విపక్షాల ప్రణాళికలను విచ్ఛిన్నం చేయడంలో తాను విజయవంతమం అయ్యానన్నారు. అలానే మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే విషయంపైన ఫడ్నవీస్ స్పందించారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎలాంటి వివాదం లేదని.. తదుపరి సీఎం ఎవరనే విషయంపై ‘మహాయుతి’ నేతలు నిర్ణయిస్తారని ఫడ్నవీస్‌ స్పష్టం చేశారు. సీఎం ఏక్‌నాథ్‌ షిండే సారథ్యంలోని పార్టీనే బాలాసాహెబ్‌ ఠాక్రే నిజమైన శివసేన అని ప్రజలే చూపించారన్నారు. ఇది బీజేపీ గెలుపు అని అన్నారు. ఇందులో తన పాత్ర చాలా చిన్నదేనని వ్యాఖ్యానించారు.


Read More..

Siddaramaiah: కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

Advertisement

Next Story

Most Viewed