2023లో 7 కోట్ల అకౌంట్లను నిషేధించిన వాట్సాప్

by S Gopi |
2023లో 7 కోట్ల అకౌంట్లను నిషేధించిన వాట్సాప్
X

దిశ, నేషనల్ బ్యూరో: మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌ గతేడాది భారీ సంఖ్యలో అకౌంట్లను నిషేధించింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఐటీ నిబంధనలకు అనుగుణంగా మోసం, అక్రమ టెలిమార్కెటింగ్ వంటి అంశాలను పరిశీలించి 2023, జనవరి-నవంబర్ మధ్య వాట్సాప్ మొత్తం 7 కోట్ల ఖాతాలను నిషేధించింది. వాట్సాప్ నెలవారీ నివేదికల ప్రకారం, గతేడాది జనవరిలో మొత్తం 29 లక్షలు, ఫిబ్రవరిలో 45 లక్షలు, మార్చిలో 47 లక్షలు, ఏప్రిల్‌లో 74 లక్షలు, మేలో 65 లక్షలు, జూన్‌లో 66 లక్షలు, జూలైలో 72 లక్షలు, ఆగష్టులో 74 లక్షలు, సెప్టెంబర్‌లో 71 లక్షలు, అక్టోబర్‌లో 75 లక్షలు, నవంబర్‌లో 71 లక్షల ఖాతాలపై నిషేధం విధించింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి 31 మధ్యకాలంలో వాట్సాప్ 79 లక్షల అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. దుర్వినియోగంతో పాటు వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకున్నట్టు వాట్సాప్ ఓ ప్రకటనలో పేర్కొంది. గతేడాది జనవరి-నవంబర్ మధ్యకాలంలో వాట్సాప్ మొత్తం 79,000 ఫిర్యాదులను వినియోగదారుల నుంచి అందుకుంది.

Advertisement

Next Story