ప్రస్తుతం ఎంతమంది మహిళా ఎంపీలు ఉన్నారు..? మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే..

by Javid Pasha |   ( Updated:2023-09-19 09:03:39.0  )
ప్రస్తుతం ఎంతమంది మహిళా ఎంపీలు ఉన్నారు..? మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా రాజకీయ నేతలందరూ ఈ బిల్లును ఆహ్వానిస్తుండగా.. ఇప్పుడు దీని గురించి పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ప్రస్తుతం మహిళా ఎంపీలు ఎంతమంది ఉన్నారు..? బిల్లు అమల్లోకి వస్తే ఏమవుతుంది? అనేది హాట్‌టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి లోక్‌సభకు 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికవ్వగా.. 24 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. మొత్తం కలిపి 103 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. పర్సంటేజీల ప్రకారం చూస్తే.. లోక్‌సభలో 14.36 శాతం, రాజ్యసభలో 10 శాతానికిపైగా మహిళా ఎంపీలు ఉన్నారు. లోక్‌సభలో బీజేపీ నుంచి 42 మంది మహిళా ఎంపీలు ఉండగా.. కాంగ్రెస్‌ నుంచి ఏడుగురు, డీఎంకే నుంచి ఇద్దరు, టీఎంసీ నుంచి 9, వైసీపీ నుంచి ముగ్గురు, శివసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఐదుగురు, బీఆర్ఎస్ నుంచి ఒక మహిళా ఎంపీ ఉన్నారు.

అటు రాజ్యసభలో చూస్తే.. బీజేపీ నుంచి 13, కాంగ్రెస్ నుంచి 5, టీఎంసీ నుంచి ఇద్దరు, బీజేడీ నుంచి ఇద్దరు మహిళా ఎంపీలు ఉన్నారు. మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే పార్లమెంట్, అసెంబ్లీలలో మూడోవంతు సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. ఇందుకోసం మహిళల కోసం నియోజకవర్గాలను రిజర్వ్ చేయనున్నారు. దీని వల్ల పార్లమెంట్, అసెంబ్లీలలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగనుంది.

Also Read More News about Women's reservation bill

Advertisement

Next Story

Most Viewed