- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘లిక్కర్ స్కాం’లో ఈడీ నెక్ట్స్ స్టెప్ ఏంటి? ఇక అరెస్టులు ముగిసినట్లేనా?
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో మద్యం తయారీ దారులు, హోల్ సేల్ వ్యాపారులు, రిటైల్ దుకాణాలకు మేలు జరిగేలా కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యవహరించిందనే ఆరోపణ ఉంది. ఈ క్రమంలోనే రూ. 100 కోట్ల మేర ముడుపులు తీసుకున్నారని ఈడీ అంటోంది. ఈ వ్యవహారంలో ఆప్ నేతలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితల కీలక పాత్ర ఉందని లిక్కర్ స్కాంలో కీలక పాత్ర ఉందని ఈడీ ఆరోపిస్తున్నది.
లిక్కర్ స్కామ్‌లో ఈడీ అరెస్ట్ చేసింది వీరినే..
2021 ఆగస్టు 19న 15 మంది పేర్లతో లిక్కర్ స్కాం పై ఎఫ్ఐఆర్ నమోదైంది. 2022 లో ఆగస్టు 17న ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. లిక్కర్ స్కామ్‌లో తొలి అరెస్ట్.. సెప్టెంబర్ 27న అప్ నేత విజయ్ నాయర్ అరెస్ట్ అయ్యారు. అక్టోబర్ 10న ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి అరెస్ట్ అయ్యారు. తాజాగా ఆయన బెయిల్ పై తిరుగుతున్నారు. నవంబర్ 11న శరత్ చంద్రారెడ్డి వ్యాపారవేత్త బినోయ్ బాబు అరెస్ట్ అయ్యారు. 2022 నవంబర్ 26న ఈడీ తొలి చార్జ్‌షీట్ నమోదు చేసింది. నవంబర్ 29న అమిత్ అరోరా అరెస్ట్ అయ్యారు. 2023 జనవరి 6న 13,657 పేజీలతో సీబీఐ అనుబంధ చార్జ్‌షీట్ దాకలు చేశారు. 2023 ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబు, ముఖ్యంగా మార్చి 7న అరుణ్ పిళ్లై, ఈ నెల 15న కవిత, తాజాగా ఢిల్లీసీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు.
ఈడీ నెక్ట్స్ స్టెప్ ఏమిటి?
లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత ఇతర ముఖ్యమైన వ్యక్తులను అరెస్ట్ చేయడంతో ఈడీ నెక్ట్స్ స్టెప్ ఏమిటని సర్వత్ర చర్చానీయాంశంగా మారింది. అలాగే కేసులో అరెస్టుల పర్వం ముగిసినట్లేనా? ఇంకా ఎవరైనా మిగిలిఉన్నారా? అరెస్టైనా వారి విచారణలో ఈడీ ఏమి తేల్చబోతున్నారని ఉత్కంఠ ఆమ్ ఆద్మీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో పెరిగింది. సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులపై ఈడీ అధికారులు ఏ విధమైన స్టెప్ తీసుకుంటారనేది వేచి చూడాలి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ అరెస్ట్‌లు ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.