- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
60 ఏళ్లలో చేయలేనిది బీజేపీ పదేళ్లలోనే సాధించింది: కాంగ్రెస్‌పై నితిన్ గడ్కరీ ఫైర్
దిశ, నేషనల్ బ్యూరో: 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేయలేనిది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్లలోనే సాధించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బీజేపీ పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి కమల్‌జీత్ సెహ్రావత్‌కు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో గడ్కరీ ప్రసంగించారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయించడానికే అని తెలిపారు. పదేళ్లలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో దేశ ప్రజలంతా చూశారని చెప్పారు. భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలని మోడీ ప్రయత్నిస్తు్న్నట్టు చెప్పారు. సమర్థ నాయకత్వంలో మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని నొక్కి చెప్పారు.
ఢిల్లీలో నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం నుండి విముక్తి పొందాలంటే బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ఈ మూడు విషయాల అమలు జరిగితే ఢిల్లీవాసుల జీవితకాలం 10 ఏళ్లు పెరుగుతుందన్నారు. దేశ రాజధానిలో కాలుష్య రహిత గాలి, నీరు కావాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో దేశ రాజధానిలో వివిధ ప్రాజెక్టులను చేపట్టినట్టు వెల్లడించారు. ప్రజలు నిజాయితీ గల నాయకత్వానికి అవకాశం ఇచ్చినందువల్లే ఈ మార్పు సాధ్యమైందని తెలిపారు. ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమని దానికి ఢిల్లీ ప్రజలు మద్దతు ఎంతో అవసరమని తెలిపారు. కాగా, ఢిల్లీలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాల్లో ఈ నెల 25న పోలింగ్ జరగనుంది.