West Pakistani Refugees : పశ్చిమ పాకిస్తాన్ వలసదారులకు ఇక నుంచి ఆస్తిహక్కు

by Hajipasha |
West Pakistani Refugees : పశ్చిమ పాకిస్తాన్ వలసదారులకు ఇక నుంచి ఆస్తిహక్కు
X

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ పాకిస్తాన్ నుంచి వలస వచ్చి జమ్మూకశ్మీర్‌లో స్థిరపడిన వారికి ఆస్తి హక్కును మంజూరు చేస్తున్నట్లు కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సారథ్యంలోని అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ప్రకటించింది. బుధవారం శ్రీనగర్‌లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో అడ్వైజర్ రాజీవ్ రాయ్ భట్నాగర్, చీఫ్ సెక్రెటరీ అటల్ డుల్లూ, ప్రిన్సిపల్ సెక్రెటరీ టు లెఫ్టినెంట్ గవర్నర్ మణిదీప్ కె.భండారి పాల్గొన్నారు. వీరంతా లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని మద్దతు ప్రకటించారు.

1947లో దేశ విభజన జరిగిన టైంలో పశ్చిమ పాకిస్తాన్ నుంచి దాదాపు 5,764 కుటుంబాలు జమ్మూకశ్మీర్‌కు వలస వచ్చాయి. వారంతా జమ్మూ, సాంబా, కథువా జిల్లాల్లో స్థిరపడ్డారు. ఆ టైంలో ప్రతీ కుటుంబానికి చెరో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించారు. ప్రస్తుతం వారి జనసంఖ్య పెరిగి 22,170కి చేరింది. 70 ఏళ్ల క్రితం కేటాయించిన భూములపై వారికి తాజాగా ఇప్పుడు ఆస్తిహక్కును ప్రస్తాదించారు. ఈ నిర్ణయంతో జమ్మూకశ్మీర్‌లోని వెస్ట్ పాకిస్తాన్ వలసదారులు సంబురాలు చేసుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed