West bengal: నీట్‌ను రద్దు చేయాలి..పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం

by vinod kumar |
West bengal: నీట్‌ను రద్దు చేయాలి..పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ సైతం ఇదే నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ మమతా బెనర్జీ ప్రభుత్వం తీర్మానం చేసింది. దీనిని రద్దు చేసి పాత విధానంలోనే పరీక్ష నిర్వహించాలని పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు మాట్లాడుతూ..తాము దేశ వ్యాప్తంగా నిర్వహించే పరీక్షలకు ఎప్పుడూ అనుకూలంగా లేమని తెలిపారు.

నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం నిర్వహించకూడదని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నరేంద్ర మోడీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే ధృడమైన చర్యగా పరీక్షలను కేంద్రానికి అప్పగించినప్పుడు సైతం నిరసనలు తెలిపామని చెప్పారు. నీట్ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. మరోవైపు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తీర్మానంపై రాష్ట్ర బీజేపీ నేత శంకర్ ఘోష్ స్పందించారు. టీఎంసీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, అవినీతిలో కూరుకు పోయిందని విమర్శించారు. అందుకే ఈ తీర్మానాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed