ఆయన ఎక్కడున్నా విడిచిపెట్టం: అసోం సీఎం బిస్వశర్మ

by samatah |
ఆయన ఎక్కడున్నా విడిచిపెట్టం: అసోం సీఎం బిస్వశర్మ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులపై దాడుల తర్వాత పరారీలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షాజహాన్ షేక్ పై అసోం సీఎం హిమంత బిస్వశర్మ మండిపడ్డాడు. షాజహాన్ షేక్ ఎక్కడ దాక్కున్నా కనిపెట్టి అరెస్టు చేస్తామన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా షాజహాన్ ఎక్కడున్నా పట్టుకుంటాడు.. అందులో ఎటువంటి సందేహమూ లేదు అని స్పష్టం చేశారు. అవసరమైతే షాజహాన్ స్వతహాగా బయటికి వచ్చేలా చేస్తాడని చెప్పారు. కాగా, ఇటీవల, బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీ వద్ద షేక్, మరో నేత శంకర్ అధ్యా నివాసాలపై దాడులు చేసేందుకు ఈడీ అధికారులు వెళ్తుండగా దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు ఈడీ ఆఫీసర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీని పిలిపించి షేక్‌ను అరెస్టు చేయాలని కోరారు. దీంతో అప్పటి నుంచి ఆయన పరారీలోనే ఉన్నాడు. మరోవైపు ఈ దాడులకు సంబంధించి పోలీసులు తాజగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిని తమెహబూబ్ మొల్లా, సుకోమల్ సర్దార్‌గా గుర్తించి కోర్టులో హాజరుపరచగా.. మూడు రోజుల కస్టడీ విధించినట్టు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed