- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో నిరంకుశ పాలనను అంతం చేస్తాం: శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో నిరంకుశ పాలనను అంతం చేస్తామని శివసేన(యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు. తమ పార్టీ ఎన్నికల గుర్తు అయిన కాగడాను, పార్టీకి సంబంధించిన ఎన్నికల పాటను మంగళవారం ముంబైలో రిలీజ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్), కాంగ్రెస్‌లతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేసిందని, మహారాష్ట్రకు సంబంధించిన అంశాలను ఎంవీఏ ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరుస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతిమూలకూ శివసేన గుర్తు చేరుకుందని, నిరంశకుశ పాలనను బూడిద చేసేందుకు సిద్ధమైందని తెలిపారు. కాగా, శివసేన పార్టీలో షిండే తిరుగుబాటు తర్వాత అసలైన శివసేన షిండేదే అని గుర్తించిన ఎన్నికల సంఘం శివసేన విల్లు బాణం గుర్తును షిండే వర్గానికి కేటాయించగా..ఉద్ధవ్ థాక్రే వర్గానికి కాగడా గుర్తును కేటాయించింది.