- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Coaching Centre: ముగ్గురు ఐఏఎస్ ఆశావహులు మృతి.. విద్యార్థుల ఆందోళన
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో వరద రావడంతో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. దీంతో, విద్యార్థులు రాత్రినుంచి కోచింగ్ సెంటర్ ఎదుట నిరసన చేపట్టారు. ఐఏఎస్ స్టడీ సర్కిల్ దగ్గర రోడ్డుపై కూర్చుని ‘మాకు న్యాయం కావాలి’ అని నినాదాలు చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)పై నిప్పులు చెరిగారు. ఎంసీడీ ఈ ఘటనను విపత్తు అని పేర్కొనడం దారుణం అని అన్నారు. “ఎంసీడీ ఇది విపత్తు అని చెప్పింది. కానీ, ఇది పూర్తిగ నిర్లక్ష్యం. అరగంట కురిసిన వర్షానికే మోకాళ్ల లోతు నీరు నిలిచిపోతుంది. ‘డిజాస్టర్’ అనేది కొన్నిసార్లు జరిగేదే. డ్రైనేజీని తప్పనిసరిగా శుభ్రం చేయాలని గత 10-12 రోజులుగా కౌన్సిలర్‌ను కోరుతున్నానని కోచింగ్ సెంటర్ బిల్డింగ్ యజమాని చెప్పాడు ” ఓ విద్యార్థి అసహనం వ్యక్తం చేశాడు. ''బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని. ఎంతమంతి చనిపోయారో, ఎందరు అస్వస్థతకు గురయ్యారో చెప్పాలి” అని మరో విద్యార్థి డిమాండ్ చేశాడు.
అసలేం జరిగిందంటే?
శనివారం రాత్రి 7 గంటల సమయంలో కోచింగ్ సెంటర్ లోపల నీరు నిలిచిందని అగ్నిమాపక విభాగానికి కాల్ వచ్చిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారని పేర్కొన్నారు. నీరు నిలిచినప్పుడు దాదాపు 30 మంది విద్యార్థులు సెల్లార్ లో ఉన్నారని వెల్లడించారు. కాగా.. కొంతమంది సైట్ నుండి తప్పించుకోగలిగారని.. మరో, 13-14 మంది విద్యార్థులను రక్షించి ఆసుపత్రికి తరలించామన్నారు. ఇద్దరు విద్యార్థినిలు, మరో విద్యార్థి గల్లంతయినట్లు తెలిపారు. వరద తగ్గాక వారి డెడ్ బాడీలను వెలికితీసినట్లు పేర్కొన్నారు. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.