- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ‘మాట్లాడలేం’ : ఈసీ అధికార ప్రతినిధి
దిశ, నేషనల్ బ్యూరో : రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. వాటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల టీమ్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై స్పందనేంటో చెప్పాలని మీడియా ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి ఒకరిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘దానిపై మేం మాట్లాడం’’ అని తేల్చి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఓ వైపు ఎన్నికల్ కోడ్‌ను ఉల్లంఘించినందుకు, మతపరమైన అంశాలను ప్రచారంలో వాడుకున్నందుకు ప్రధాని మోడీపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే.. మరోవైపు ఈసీ మాత్రం కనీసం ఈ అంశంపై నోరు విప్పేందుకు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. కాగా, దేశపు ఆస్తులపై తొలి హక్కు ముస్లింలకే ఉంటుందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గతంలో వ్యాఖ్యానించారని రాజస్థాన్ సభలో ప్రధాని మోడీ తెలిపారు. మెజారిటీ వర్గాల ప్రజల కష్టార్జితాన్ని ‘ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లకు’(ఓ మైనారిటీ వర్గం) కట్టబెట్టాలనే కుట్రతో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆయన ఆరోపించారు. ఓ ప్రధాన మైనారిటీ వర్గం ప్రజలను ఈ సభ వేదికగా ప్రధాని మోడీ లక్ష్యంగా ఎంచుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.