Raghav Chadha : 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీచేసే అవకాశమివ్వాలి : రాఘవ్ చద్దా

by Hajipasha |   ( Updated:2024-08-01 14:53:13.0  )
Raghav Chadha : 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీచేసే అవకాశమివ్వాలి : రాఘవ్ చద్దా
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో కీలక అంశాన్ని లేవనెత్తారు. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు అభ్యర్థులు పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. మన దేశ యువతకు 18 ఏళ్లు రాగానే ఓటు హక్కు కల్పిస్తున్నప్పుడు.. 21 ఏళ్లు రాగానే ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని ఎందుకు ఇవ్వకూడదని చద్దా ప్రశ్నించారు. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత, ప్రోత్సాహం అందించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వృద్ధ రాజకీయ నాయకులతో కూడిన యువ దేశంగా భారత్ మారిందని ఆయన కామెంట్ చేశారు.

యువ రాజకీయ నాయకులతో కూడిన యువ దేశంగా భారత్‌ను మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రాజకీయాలను చెడుకోణంలో చూసే ధోరణి పోయేలా.. దానికి వన్నెతేవాల్సిన బాధ్యత ప్రతీ రాజకీయ నాయకుడిపై ఉందని చద్దా అభిప్రాయపడ్డారు. ‘‘స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో 26 శాతం మంది 40 ఏళ్లలోపువారే ఎన్నికయ్యారని తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతోంది. 17వ లోక్‌సభలో కేవలం 12 శాతం ఎంపీలే 40 ఏళ్లలోపువారు’’ అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed